Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఐసెట్ ర్యాంకర్లకు అభినందనలు

ఐసెట్ ర్యాంకర్లకు అభినందనలు

విశాలాంధ్ర ధర్మవరం: ఏపీ ఐసెట్ 2025 నందు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను బుధవారం నాడు స్థానిక శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల విద్యార్థి యం. నారాయణ స్వామి 1582 ర్యాంకును, సోమసాయి 10వేల ర్యాంకును, 15 వేలలోపు నలుగురు విద్యార్థులు, 20 వేలలోపు 18 మందికి ర్యాంకులు రావటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్,అధ్యాపకులు శ్రీనివాసులు, శిరీష విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు