Tuesday, December 10, 2024
Homeజిల్లాలుఅనంతపురంవసతిగృహాల నిర్మాణ, మరమ్మత్తు పనులు సంక్రాంతిలోపు త్వరితగతిన పూర్తి చేయాలి

వసతిగృహాల నిర్మాణ, మరమ్మత్తు పనులు సంక్రాంతిలోపు త్వరితగతిన పూర్తి చేయాలి

వసతి గృహాలలో సీసీ కెమెరా ఏర్పాటు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : వసతిగృహాల నిర్మాణ, మరమ్మత్తు పనులు వచ్చే సంక్రాంతిలోపు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన విద్యా, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 11 సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లకు డిస్టిక్ మినరల్ ఫండ్ ద్వారా జిల్లాకు కోటి 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, దీనికి సంబంధించి  పది హాస్టల్లో పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన ఒకటి కూడా పూర్తి చేసి అధికార ప్రజా ప్రతినిధులతో ప్రారంభోత్సవం గావించాలన్నారు. ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన 5 కోట్ల 70 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందని, వాటిని ఏపీఈడబ్ల్యూఐడిసి మరియు పంచాయతీరాజ్  ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా 36 హాస్టల్ కు సంబంధించిన పనులన్నీ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, వసతి గృహాల వద్ద నిఘా ఏర్పాటల్లో భాగంగా సీసీ కెమెరాలు ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయని, వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా పరిషత్ నుండి కేటాయించిన నిధులను జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సమాన నిష్పత్తిలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కేటాయించి, వసతి గృహాలలో ప్రాముఖ్యత కలిగిన పనులను గుర్తించి, వాటిని పూర్తి చేయు విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో ట్యూటర్లను రెండు వారాలలోపు  నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ సంబంధించిన పనులన్నీ సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. విద్యా, అనుబంధ శాఖలు మనకున్నటువంటి అన్ని శాఖల కంటే చాలా ముఖ్యమైనది మరియు  ప్రాముఖ్యమైనదని కావున ప్రతి ఒక్క అధికారి కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని అధికారులకు తెలియజేశారు. ప్రతి ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి సమస్యలను గుర్తించి వాటిని అధికమించేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డి డి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి, ఏపీఎం నాగరాజు, జిల్లా ఉపాధి కల్పన అధికారిని కళ్యాణి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి జిల్లా అధికారి రామ సుబ్బారెడ్డి,బిసి వెల్ఫేర్, డిటిడబ్ల్యూఓ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు