Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి

నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున నిరుపేదలకు ఇచ్చి నిర్మాణం చేపట్టాలంటూ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం పెద్దకడబూరులోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలం ఇచ్చిందని అది కూడా ఊరి బయట నివాసయోగ్యానికి, పనికిరాని స్థలాలు కేటాయించడం వల్ల పేదలు ఎవరూ కూడా ఇళ్లు నిర్మించుకొనటానికి ముందుకు రాలేదన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం 1.80 లక్షలు కేటాయించిందని, అది పునాదులకు కూడా సరిపోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీఆర్వో నరసప్పకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, మండల కార్యదర్శి దస్తగిరి, నాయకులు తిక్కన్న, హనుమంతు, నర్సింహులు, గోపాల్, రామాంజనేయులు, డోలు హనుమంతు, రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు