పలువురు కౌన్సిలర్లు డిమాండ్
పట్టణములో నీటి కొరత లేకుండా గట్టి చర్యలు చేపడతాం..
మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పురపాలక సంఘంలోని నిధులను సక్రమంగా వినియోగించాలని తద్వారా పట్టణ అభివృద్ధికి అధికారులు దోహదం చేయాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో పట్టణానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు దృష్టి సారించి, 17 అంశాలపై కౌన్సిలర్ తో చర్చించి, వాటికి ఆమోదముద్రం వేశారు. అనంతరం చందుమూరి నారాయణరెడ్డి, జెసిబి రమణ, మాసపల్లి సాయికుమార్ తదితర కౌన్సిలర్లు మాట్లాడుతూ అసలే ఎండాకాలం, పట్టణంలో నీటి కొరత ఎక్కువగా ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ట్రై క్టర్లను వాడకుండా ప్రైవేటుగా ట్రాక్టర్లకు నెలకు ఆర్థిక అధికారిగా తీసుకోవడం వల్ల మున్సిపల్ ఆఫీస్ కు ఎంతో ఖర్చు వస్తుందని వారు గుర్తు చేశారు. స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం 10 ట్రాక్టర్లలో కేవలం కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి మరమ్మత్తులు చేయాల్సి ఉందని వారు తెలిపారు. మరమ్మతులు పూర్తి అయిన తర్వాత తప్పక మున్సిపాలిటీకి సంబంధించిన ట్రాక్టర్లను మాత్రమే ఉపయోగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ధర్మవరం జనాభాను బట్టి మరికొన్ని ట్రాక్టర్లను కొనుగోలు చేస్తే, ప్రైవేటు డాక్టర్ల బెడద ఉండదని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా పలువురు కౌన్సిలర్ మాట్లాడుతూ పట్టణంలో వీధి దీపాల కొరత, తాగునీటి కొరత అధికంగా ఉందని, ప్రజల ద్వారా ఫిర్యాదులు అందిన కూడా పట్టణ అధికారులు స్పందించకపోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఇటీవలే కొన్ని వార్డులలో ప్రజలు నీరు దొరకక రోడ్డు వద్ద ధర్నా చేస్తున్నారు కదా, మున్సిపల్ ఇంజనీరింగ్లు ఎటువంటి విధులు నిర్వర్తిస్తున్నారో మాకు అర్థం కాలేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం కూడా సరిగా లేదని, మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌన్సిలర్లు తెలిపారు. అదేవిధంగా పట్టణములో కొన్ని వాటర్ ప్లాంట్ కు అనుమతి లేదని, చట్టపరంగా వాటిని ఉపయోగించుకోకుండా అపరిశుభ్రతతో కూడినటువంటి వాటర్ ఫిల్టర్ ను ప్రజలకు అందించడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్లు ప్రశ్నించారు. అదేవిధంగా ఎండాకాలంలో త్రాగునీటి కొరకు ఫిల్టర్ వాటర్ ను రూ.10 నుండి 12 రూపాయల వరకు వసూలు చేయడం పద్ధతేనా అని వారు ప్రశ్నించారు. పట్టణంలోని ముఖ్యమైన కూడలీలలో హైమాక్స్ లైట్లు పనిచేయడం లేదని వారు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని వీధి దీపాలు, నీటి కొరత విషయంలో తప్పక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ శంషాద్ బేగం, జయరామిరెడ్డి, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.