విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ, మంత్రాలయం, మాధవరం ఎస్సై లు పాల్గొని గ్రామంలో సమస్యాత్మక వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జరిగే ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


