Saturday, May 24, 2025
Homeజాతీయంబెంగళూరులో మళ్లీ కరోనా కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

బెంగళూరులో మళ్లీ కరోనా కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం విజ్ఞప్తి
బెంగళూరు నగరంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గత 20 రోజుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఓ సలహా ప్రకటన జారీ చేసింది. శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ, ఈ ఏడాది కర్ణాటకలో ఇప్పటివరకు 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 32 కేసులు ఒక్క బెంగళూరు నగరంలోనే వెలుగు చూశాయి అని తెలిపారు. ఁగత 20 రోజులుగా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదు. అయినప్పటికీ ప్రజలు ముందుజాగ్రత్తగా కొవిడ్ నిబంధనలు పాటించడం అవసరం,ఁ అని ఆయన సూచించారు. గర్భిణులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, హ్యాండ్ శానిటైజర్లు వాడాలని ఆయన కోరారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని, తద్వారా సకాలంలో చికిత్స పొంది, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని మంత్రి వివరించారు.

ఇదిలా ఉండగా, బెంగళూరులో తొమ్మిది నెలల పసికందుకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. మే 22న జరిపిన రాపిడ్ యాంటీజెన్ టెస్టులో చిన్నారికి వైరస్ సోకినట్లు తేలిందని వారు తెలిపారు. బెంగళూరు నగర శివార్లలోని హోస్కోటే పట్టణానికి చెందిన ఈ చిన్నారి ప్రస్తుతం వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం.

మరోవైపు, దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసుల పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్, హాంగ్ కాంగ్ వంటి దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా తగిన చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఁమన దగ్గర కూడా కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకుని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి,ఁ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు