పట్టణ అభివృద్ధికి అధికారులు సహకరిస్తేనే కౌన్సిలర్లకు మంచి గుర్తింపు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వార్డుల సమస్యలపై పలువురు కౌన్సిలర్లు అధికారులపై ధ్వజమెత్తారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధికి అధికారులు సహకరిస్తేనే మాకు కౌన్సిలర్లుగా ప్రజల వద్ద మంచి గుర్తింపు లభిస్తుందని కౌన్సిలర్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్మన్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను చదివి వినిపించారు. అనంతరం అజెండాలోని పలు అంశాలపై అభ్యంతరాలను తెలుపుతూ, మాకు సరైన న్యాయం జరగాలని వారు తెలిపారు. అంతేకాకుండా పట్టణంలో కొన్ని ఇండ్లకు ప్లాన్ అప్రూవల్ తీసుకున్న కూడా ఎందుకు అధికారులు అడ్డుపడుతున్నారని వారు ఇంజనీరింగ్ సెక్షన్ ను ప్రశ్నించారు. కేబుల్ వైర్లకు వేసేందుకు రోడ్డును డ్యామేజ్ చేస్తున్నా కూడా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్లు నిలదీశారు. పట్టణంలో ప్రతి ఇంటికి ప్లాన్ అప్రూవల్ అయిన వెంటనే అడ్డుకోకూడదన్న విషయం కూడా అధికారులకు ఎందుకు తెలియకపోతోందో అర్థం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కౌన్సిలర్ చెందమూరి నారాయణరెడ్డి, తదితర కౌన్సిలర్లు మాట్లాడుతూ ఇక మీదట ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత నిర్మాణాలను అడ్డుకుంటే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. కమిషనర్ ఇందుకు స్పందిస్తూ పట్టణంలో దాదాపు 363 ఇళ్లకు చలానా తక్కువ ఉన్నట్టు గుర్తించి నోటీసులు జారీ చేసి వాటిని రెటిపై చేయడం జరిగిందన్నారు. జనరల్ ఫండ్స్ ను చట్టం ప్రకారమే నిధులు ఖర్చు పెట్టాలని తెలిపారు. తదుపరి కౌన్సిల్లో యోగా అసోసియేషన్కు మున్సిపల్ కాంప్లెక్స్ పైన స్థలం కేటాయించకుండా తీర్మానం చేశారు. అంతేకాకుండా కాయగూరల మార్కెట్ వద్ద వ్యాపారస్తులు లక్షలు వెచ్చించి గదులు చిన్నపాటి దుకాణాలు పెట్టుకున్నారని, కానీ వారికి వ్యాపారం జరగడం లేదని తెలిపారు. ఇందుకు కారణం కాయగూరల మార్కెట్ బయట పదుల సంఖ్యలో దుకాణాలు పెట్టడం వల్లనే వారు నష్టపోతున్నారని, బయట పెట్టుకున్న దుకాణాలను వెనివెంటనే అధికారులు తొలగించాలని తెలిపారు. పట్టణాలలో కొళాయి పైపులైన్ల కోసం గుంతలు తవ్వి వాటిని అలాగే వదలడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం ఇస్తూ కౌన్సిలర్లకు న్యాయం జరిగే విధంగా తాము తమ విధులను నిర్వర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ శంషాద్ బేగం, వేముల జయరాం రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్, ఆర్ ఐ, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు ధ్వజం
RELATED ARTICLES