ఏ.ఐ.వై.ఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో ఆర్ డి ఓ కు వినతులు
విశాలాంధ్ర అనంతపురం: గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి ఏ.ఐ.వై.ఎఫ్ నగర సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆర్ డి ఓ కు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంద్భంగా ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ శ్రీనివాస్ మాట్లాడుతూ… గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు వారి సీనియారిటీ ఆధారంగా చేయాలని అఖిల భారత సమాఖ్య ( ఏఐవైఎఫ్ ) కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరగబోతున్న బదిలీలలో చాలా మంది ఉద్యోగులు తమకు అనుకూలంగా ఉన్న స్థానాల కోసం రాజకీయ బలాలను ఉపయోగిస్తున్నారు అని పేర్కొన్నారు. బదిలీల కౌన్సిలింగ్ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సాధారణంగా బదిలీల కౌన్సిలింగ్ సీనియారిటీ లిస్టుల ఆధారంగా నిర్వహించాలి. కానీ ఇలా లెటర్స్ తెచ్చుకోవడం వలన ఒకే స్థానానికి చాలామంది పోటీ పడే అవకాశం కనపడుతోందన్నారు. ఒకవేళ కేవలం లెటర్ల సహాయంతో మాత్రమే బదిలీలు జరిగితే సీనియారిటీ కలిగిన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. సీనియారిటీకి విలువ లేకుండా పోతోందన్నారు. దీంతో ఉద్యోగుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా ఉంది.కావున ఉపాధ్యాయుల మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కూడా వారి సీనియార్టీ ఆధారంగానే కౌన్సిలింగ్ అత్యంత పారరదర్శకంగా నిర్వహించాలని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర సహాయ కార్యదర్శులు సురేంద్ర, అశోక్ కన్నా పాల్గొన్నారు..