Homeఅంతర్జాతీయంఅమెరికాకు మద్దతిచ్చిన దేశాలకు ఇబ్బందుల తప్పవు: ఇరాన్

అమెరికాకు మద్దతిచ్చిన దేశాలకు ఇబ్బందుల తప్పవు: ఇరాన్

- Advertisement -


తెహ్రాన్: తమపై అమెరికా విధించిన ఆంక్షలకు మద్దతిచ్చిన దేశాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. అటువంటి దేశాల నౌకలు హోర్మూజ్‌ను దాటి వెళ్లడానికి అంతరాయాలు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ యుద్ధంలో అమెరికా ఏ లక్ష్యాన్ని చేరుకోలేదని, ఆ దేశం ఆటలు సాగనివ్వలేదని పేర్కొంది. తమను ఎదుర్కోలేకనే కాల్పుల విరమణకు అంగీకరించిందని ఎద్దేవా చేసింది. ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. హోర్మూజ్ దాటి వెళ్లడానికి ఇరాన్‌కు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదని అమెరికా హెచ్చరించింది. ఇదే సమయంలో నౌకా యానంపై ఇరాన్ విధించిన ఆంక్షలు నిలిపివేయాలని కోరుతూ అమెరికా`బెహ్రెయిన్‌లు ఓ ప్రతిపాదిత తీర్మానాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఓ ఇరాన్ సైన్యాధికారి స్పందిస్తూ…హోర్మూజ్‌లో చట్టపరమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అక్కడ ప్రయాణించే ఏ నౌకైనా తమతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటందని స్పష్టం చేశారు. అంతేగానీ అమెరికా ఆంక్షలకు తలొగ్గేదే లేదన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు