విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సి లింగమయ్య చాకలి ఐలమ్మ కాలనీ రాకెట్ల నారాయణరెడ్డి కాలనీ బిందెల కాలనీ లో గురువారం జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి లింగమయ్య మాట్లాడుతూ… ఎనెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలలో ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలో ఎద కోసి ఎగబోసి ఎరుపెక్కి పోయిందన్నారు. ఎగరనీ ఎగరనీ మన జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరయనీ వినువీధి మన జెండా ఎర్రమందారాల పూలదండ అని తెలిపారు. సిపిఐ భూ పోరాటాలు సాగునీరు, తాగునీరు అందించాలని పోరాటం చేయడం జరిగిందన్నారు. సిపిఐ పేదలకు కార్మికులకు ఉద్యోగస్తులకు అణగారిన వర్గాలకు కష్టజీవులకు అండగా నిలబడేది సిపిఐ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివిహరి కృష్ణ బిందెల కాలనీ సిపిఐ కార్యదర్శి బిందెల నారాయణస్వామి, ఐలమ్మ కాలనీ సిపిఐ కార్యదర్శి నాగరాజు, రాకెట్ల, నారాయణరెడ్డి కాలనీ సహాయ ఆజీపీరా, కార్యదర్శి చేతి వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు పెయింటర్ భూషణ, సిపిఐ నాయకులు దాదు, సహాయ కార్యదర్శి సంజీవులు, నారాయణస్వామి, బికేస్ మాజీ ఉప సర్పంచ్ లలిత, తదితరులు పాల్గొన్నారు.