పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ నాయకుడు అయ్యప్ప శుక్రవారం ఆకస్మిక మృతి చెందగా ఆయన పార్థివ దేహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి. లింగమయ్య అన్న కుమారుడు అయినటువంటి అయ్యప్ప మరణం సిపిఐ పార్టీకి తీరనిలోటు అన్నారు. 20 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ సభ్యులుగా పార్టీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొనేవాడు అన్నారు. రజక వృత్తిదారుల సమాఖ్య అనంత నగర అధ్యక్షులుగా కూడా 10 సంవత్సరాలు ఆయన సేవలందించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, పి. నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, పెద్దయ్య, తదితర నాయకులు సంతాపాన్ని తెలియజేశారు.