Sunday, January 5, 2025
Homeజిల్లాలుకర్నూలుఫ్రెండ్లీ ఎస్ఐ నిరంజన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నాయకులు

ఫ్రెండ్లీ ఎస్ఐ నిరంజన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డికి శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎస్ఐ కు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీనియర్ నాయకులు ఇస్మాయిల్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలపై మంచి అవగాహన కలిగిన వ్యక్తి ఎస్ఐ అన్నారు. రాజకీయ నాయకుల మాటలకు తలొగ్గకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారని కొనియాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, దస్తగిరి, డోలు హనుమంతు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు