విశాలాంధ్ర అనంతపురం : ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ బి వినోద్ కుమార్ ను శుక్రవారం కలెక్టరేట్లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి సి. జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. కేశవరెడ్డి, చేతి వృత్తిదారుల సంఘం వర్కింగ్ అధ్యక్షులు సి. లింగమయ్య అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ… గడిచిన సార్వత్రిక ఎన్నికలలో చైతన్యవంతం చేయడం ఓటర్ లిస్ట్ ల జాబితాలో సవరణలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాల ప్రతిపాదనపై ఉత్తమ ఎన్నికల అధికారిగా అనంత జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎంపిక అవ్వడం పట్ల అనంత జిల్లాకే గర్వకారణమన్నారు. సందర్భంగా సిపిఐ జిల్లా సమితి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి. రంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి డి.పెద్దయ్య, పెరుగు సంగప్ప, చిన్న రాయుడు, మల్లెల శ్రీనివాసులు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.