విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణ పరిధిలోని ఎల్ 4 కాలనీ సమీపంలో ప్రభుత్వం నిర్మించిన అపార్ట్మెంట్ లను గురువారం సి పి ఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న,ఆలకుంట మారుతీ, టీ.అయూబ్ ఖాన్ తదితరులు పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2017 సంవత్సరము అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ గృహాల నిర్మాణం చేపట్టారని, ఆ తరువాత 2019 నుండి 2024 వరకు అధికారం లో వున్న వైసీపీ ప్రభుత్వం కూడా ఈ గృహాలని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయలేదన్నారు.ఇప్పుడు ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వ ము, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరు కూడా ఇప్పటికి ఇక్కడ కన్నెత్తి చూడలేదన్నారు.టీడ్కో గృహాల నిర్మాణం చేపట్టి దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం పూర్తి కావస్తున్న,
ఇప్పటికీ మూడు సార్లు ప్రభుత్వాలుమారిన,
ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి సత్తి కుమార్ యాదవ్ అయినప్పటికీ, పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సముదాయలను ఇప్పటికైనా పేదలకి అందజేయాలనీ డిమాండ్ చేశారు.ఈ పనులు ప్రారంభం చేసినప్పటి నుండి ఇప్పుడుకి ముగ్గురు ముఖ్యమంత్రులు మారినరాని, అదేవిదంగ కాంట్రాక్టర్ లు కూడా ముగ్గురు మారటం జరిగినదని తెలిపారు. ఇక్కడ కనీస సౌకర్యాలు అయిన విద్యుత్, రోడ్డు, డ్రైనేజీ పనులు వంటివి తలుచుకుంటే ఇంకా చాలా దారుణంగా ఉన్నాయని, అంతే కాకుండా పనులకు వాడిన సామాగ్రి నాసిరకమైనది వినియోగించారని, ఇక్కడ పనులను పరిశీలించడం వలన మేము ప్రత్యక్షంగా చూసామన్నారు అని తెలిపారు. లబ్ధిదారులు కి గృహాలని అందజేయకనే గోడలు కి పగుళ్ళు వచ్చాయని, వీటిలో పేదల నివాసం సాధ్యం కాదని స్పష్టం చేశారు.సమీపంలో వున్న ఎల్ 4- ఎల్ 3,కాలనీ లలో కూడా ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న మంచినీరు, వీధి లైట్లు, డ్రైనేజీ కాలువలు,కుక్కల బెడద కూడా అధికంగా ఉందని స్థానికులు నాయకులు కి తెలిపారు. ఇన్ని సమస్యలకి నిలయంగా వున్న ఈ ప్రాంతాలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటిస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు. ప్రజా సమస్యలు పై ఈ నెల 25 జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయము వద్ద జరిపే నిరసన కార్యక్రమానికి సి పి ఎం పార్టీ నాయకులు కార్యకర్తలు, పేద ప్రజలతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు గుంపు హరి, సి పి ఎం నాయకులు వెంకటస్వామి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
టీడ్కో గృహాలను పరిశీలించిన సి పి ఎం నాయకులు
RELATED ARTICLES