Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సిపిఎం నిరసన

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సిపిఎం నిరసన

విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని తెలుపుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు కళ్లకు గంతలు కట్టుకొని నిరబసనను సిపిఎం నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ భాష,జే.వి రమణ, పెద్దన్న,మారుతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మన రాష్ట్రానికి నిధుల కేటాయింపులలో అన్యాయం జరిగినదని ,దేశవ్యాప్త పిలుపులో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు నిధులు చాలా అన్యాయంగా కేటాయింపులు జరిగినయని ,నిధుల కేటాయింపులలో అన్యాయం జరగడంతో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోదని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయింపులు జరగాలని, పోలవరానికి నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ను ప్రకటించాలని, రాయలసీమలోని అన్ని కాలువలకు మరమ్మతులు చేపట్టి ప్రతి చెరువును నీటితో నింపాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా లభిస్తే రాష్ట్రం అభివృద్ధి కావడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారని ఆ విధంగా నిరుద్యోగ సమస్య తగ్గుతుందని, రాష్ట్రం అభివృద్ధి అవుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా కేటాయించే వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగిందన్నారు. జీఎస్టీ 100 రూపాయలు వసూలు చేస్తే మన రాష్ట్రానికి కేవలం 46 రూపాయలు ఇస్తున్నదని, తెలంగాణ ప్రాంతానికి 50 రూపాయలు మాత్రమే ఇస్తున్నదని, ఉత్తర భారతదేశానికి 300 రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు వెనకకు ఇస్తూ ఆ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతున్నదని తెలిపారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని, కార్మికులు పేద బడుగు బలహీన వర్గ ప్రజల అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కార్మిక వ్యవస్థ నిర్వీర్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగాలు పన్నుతున్న యని, కాంట్రాక్ట్ క్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచే బడ్జెట్ కాదని, రైతుల రుణమాఫీ కోసం అవసరమైన బడ్జెట్ కాదని ఇటువంటి దారుణమైన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ, రాష్ట్ర ప్రజలకు, కార్మికులకు, రైతులకు తీరని అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్. ఆదినారాయణ ఎస్. హైదరవలి సిఐటియు నాయకులు హరి, వెంకట స్వామి, ఖాదర్బాషా, వెంకటరాముడు, ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు