Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబియ్యం కార్డులకు కేవైసీ గడువును పొడిగించాలని ఆర్డిఓ కు వినతి ..సిపిఎం

బియ్యం కార్డులకు కేవైసీ గడువును పొడిగించాలని ఆర్డిఓ కు వినతి ..సిపిఎం

విశాలాంధ్ర -ధర్మవరం;; బియ్యం కార్డులకు కేటాయించిన ఈకేవైసీ గడువును పొడిగించాలని కోరుతూ సిపిఎం నాయకులు మారుతీ, ఎస్హెచ్ భాష ,జెవి రమణ లు ఆర్డిఓ మహేష్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డులకు సంబంధించి ఈ కేవైసీ గడువును ఈ నెల 30 తారీఖున చివరి తేదీగా ప్రకటించడం వలన అనేకమంది వృద్దులు పిల్లలకు ఈ కేవైసీ పని చేయకపోవడంతో వారు ఇబ్బందులకు గురి అవుతున్నారని, దూర ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సందర్భంగా వారు ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు వారు రావడానికి అవకాశం లేనందున విద్యార్థులకు ఈ కేవైసీ చేయించుకోవడానికి అవకాశం లేనందున రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వమిచ్చే సెలవల వరకు పొడిగించాలని తెలిపారు.అదేవిధంగా ఈ కేవైసీ తీసుకోవడానికి ప్రతి స్టోర్ డీలర్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లాలని ఆ విధంగా లబ్ధిదారుల అందరికి ఈ కేవైసీ చేయించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదర్ వలీ, హరి , ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు