Homeజాతీయంలారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై ఉక్కుపాదం.. కీలక షూటర్‌ రోహిత్‌పై పోలీసుల కాల్పులు!

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై ఉక్కుపాదం.. కీలక షూటర్‌ రోహిత్‌పై పోలీసుల కాల్పులు!

- Advertisement -

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా ఆగడాలపై హర్యానా పోలీసులు, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఉక్కుపాదం మోపాయి.సోనిపట్‌ జిల్లా పరిధిలోని బరోటా-ఛతేరా మార్గంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన కీలక ఆపరేటివ్‌ రోహిత్‌ అలియాస్‌ బోదా కదలికలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఎస్‌టీఎఫ్‌ సంయుక్తంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.ఈ క్రమంలో పోలీసులను గమనించిన నిందితుడు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.అదే సమయంలో భద్రతా బలగాలపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో రెండు బుల్లెట్లు రోహిత్‌ కాళ్లలోకి దూసుకెళ్లడంతో అతడు కుప్పకూలాడు.

పలు నేరాల్లో కీలక నిందితుడు
వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం సోనిపట్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఘటనా స్థలం నుంచి నిందితుడు వినియోగించిన పిస్టల్‌, లైవ్‌ రౌండ్లు, మోటార్‌ బైక్‌తో పాటు ఒక బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గాయపడిన రోహిత్‌.. లారెన్స్‌ బిష్ణోయ్‌, రోహిత్‌ గోదారా సిండికేట్‌లో చురుకైన షూటర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.హర్యానా గాయకుడు దిలేర్‌ ఖార్కియా రేంజ్‌ రోవర్‌ కారుపై కాల్పులు జరిపిన ఘటనలోనూ, సోనిపట్‌కు చెందిన ఓ వ్యాపారిని బెదిరించి ఏకంగా రూ.2 కోట్లను రంగేదారీ (ఎక్స్‌టార్షన్‌)గా డిమాండ్‌ చేసిన వ్యవహారంలోనూ రోహిత్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అతడిపై డజనుకు పైగా క్రిమినల్‌ కేసులు
హత్యాయత్నం, దోపిడీ, బెదిరింపులు, అక్రమ ఆయుధాల వినియోగం సహా పలు తీవ్రమైన నేరాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అతడిపై డజనుకు పైగా క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయని అధికారులు వెల్లడించారు.రోహిత్‌ తలపై గతంలోనే రివార్డు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు స్థానికంగా ఆశ్రయం కల్పిస్తున్న ఇతర నెట్‌వర్క్‌ వివరాలను కూడా వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు