Homeఆంధ్రప్రదేశ్నేరాలపై  అవగాహన

నేరాలపై  అవగాహన

- Advertisement -

మహిళలపై జరుగుతున్న నేరాలపై  అవగాహన కార్యక్రమాలు

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : జిల్లాలోని వివిధ స్కూళ్లు, కాలేజీలు మరియు బాలికల హాస్టల్స్ లో   మహిళలపై జరుగుతున్న నేరాలపై సౌత్ జోన్ డిఎస్ పి శ్రీమతి ఎస్. భవ్య కిషోర్, ఇన్ స్పెక్ట‌ర్   శ్రీమతి కె. మంగాదేవి  ఆధ్వర్యంలో  శ‌క్తి టీంలు  అవగాహన కార్యక్రమాలు ,  ర్యాలీలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా   శ్రీమతి ఎస్. భవ్య కిషోర్ మహిళలు  బాలికలపై జరిగే లైంగిక దాడులపై వారిలో విసృత అవగాహన కల్పించారు. అదేవిధంగా మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్  టెక్నిక్స్ గురించి, సైబర్ నేరాల గురించి, సోషల్ మీడియా నష్టాల గురించి, పోక్సో చట్టం,   శక్తి యాప్  ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. మహిళలంతా  శక్తి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, ఎవరికైనా ఎటువంటి ఆపద వచ్చినా, ఏ సమయంలో నైనా శక్తి యాప్ ద్వారా జిల్లా పోలీసుల సహాయం కోరవచ్చని ఆమె తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు