Homeఅంతర్జాతీయంగీత దాటితే వేటు

గీత దాటితే వేటు

- Advertisement -

శాశ్వత నివాసితులు, గ్రీన్ కార్డు హోల్డర్లు నేరాలకు పాల్పడితే దేశ బహిష్కరణ
అమెరికా సుప్రీం కోర్టు తీర్పు
వాషింగ్టన్:
నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడితే శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డు హోల్డర్లు అయినా సరే దేశం నుంచి బహిష్కరించేలా ప్రభుత్వానికి ఉన్న అధికారాలను అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఆ కేసుల్లో ఆ నేరం జరిగి ఉండొచ్చని నమ్మడానికి బలమైన కారణం ఉన్నట్లు అధికారులు నిర్ధరించాల్సి ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు ఎంట్రీ పాయింట్ల వద్దే అమెరికాలో ప్రవేశానికి నిరాకరించేలా ఈ తీర్పు అనుమతిస్తోంది. దేశం నుంచి డిపోర్ట్ (దేశ బహిష్కరణ) చేయడానికి బోర్డర్ ఏజెంట్ల అధికారాలకు మరింత బలం చేకూరుస్తోంది. నకిలీ ట్రేడ్‌మార్క్‌కు సంబంధించి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన చైనా జాతీయుడు మక్ చోయ్ అభియోగాలు నమోదయ్యాయి. దాంతో 2012లో అతడు చైనా నుంచి అమెరికాకు తిరిగిరాగా… దేశంలోకి ప్రవేశించేందుకు అధికారులు నిరాకరించారు. తర్వాత కఠిన షరతులతో ప్రవేశానికి అనుమతించారు. తర్వాత తాను తప్ప్పు చేసినట్లు మక్ చోయ్ అంగీకరించాడు. దాంతో అతడిని దేశం నుంచి బహిష్కించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. తాను చేసిన నేరం నైతిక దుష్ప్రవర్తన కిందికి కాదని అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ అతడికి యూఎస్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు