విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సోమవారం నుంచి శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం అల్పాహారమును నిర్వహించడం జరుగుతోందని హాకీ సత్యసాయి జిల్లాఅధ్యక్షులు బంధనాదం సూర్య ప్రకాష్, సాయిబాబా ఆలయ అధ్యక్షుడు వీరనారాయణ ,కార్యదర్శి రామలింగయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఈ క్రీడా మైదానంలో వివిధ రకాల క్రీడలను నేర్చుకునేందుకు ఎంతో మంది క్రీడాకారులు రావడం జరుగుతుందని, వారికి సాయంత్రం పూట అల్పాహారం ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఏర్పాటు పట్ల క్రీడాకారులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పార్కు అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి తో పాటు మారుతి, గౌరీ ప్రసాద్, చంద్ర, సాయి, ప్రభాకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు ప్రతిరోజు అల్పాహారం.. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి
RELATED ARTICLES