Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాట్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాంటిది

నాట్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాంటిది

విశాలాంధ్ర ధర్మవరం : నాట్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాంటిదని పట్టణ ప్రముఖులు, ప్రముఖ ధాత సంధా రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తొలుత కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మానస నృత్య కళా కేంద్రంలో శిక్షణ పొందిన 20 మంది చిన్నారుల యొక్క నృత్య ప్రదర్శన గురువు మానస ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువు మానస మాట్లాడుతూ హిందూ సంస్కృతి కళాకారులుగా, మా వంతుగా నాట్యము, నృత్య ప్రదర్శన చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలు, రాష్ట్రాలలో మా నాట్య ప్రదర్శనను నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి చందా రాఘవ తో పాటు జింకా పురుషోత్తం, దేవస్థానం అర్చకులు ధనుంజయ చేతుల మీదుగా గురువు మానసను ఘనంగా సన్మానించారు. అనంతరం చిన్నారులకు మెమొంటోస్ని ఇస్తూ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు