విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలేటివారిపాలెం మండలం నూతన ఏపీఓ గా కె. దయాసాగర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ ఏపీఓ గా విధులు నిర్వర్తిస్తున్న ఉమామహేష్ బదిలీ అయ్యారు. వారి స్థానంలో నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం నుండి కె దయాసాగర్ బదిలీ పై వలేటివారిపాలెం మండలం వచ్చారు.ఈ సందర్బంగా టెక్నీకల్ అసిస్టెంట్ లు ప్రసాదు, మాలకొండయ్య, అశోక్, నాగార్జున, మాలకొండయ్య లు శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన మాట్లాడుతూ టెక్నీకల్ అసిస్టెంట్ లను పీల్డ్ అసిస్టెంట్ లను సమన్వయం చేసుకుంటూ మండలంనకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేస్తామని అన్నారు.మండలంలోని ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులు ప్రారంభిస్తామని అన్నారు. కూలీలకు అవగాహన కల్పించి ప్రభుత్వం నిర్దేశించిన కూలి పొందే విధంగా పనులు చేపిస్తామని అన్నారు.ఉపాధిహామీ కూలీలకు, సిబ్బంది కి అందుబాటులో ఉంటానని, ఏమైనా సమస్యలు వస్తే తన ద్రుష్టి కి తీసుకొని వస్తే సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.