- Advertisement -
సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్.లక్ష్మణ్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;;ఫసల్ బీమా పథకంలో వరి,మొక్కజొన్న, కంది, రాగి, ఆముదం ,పంటలకు జులై నెల 31 వ తారీకు వరకు ఉన్న గడువు ను ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి ఆగస్టు 15 తారీకు వరకు పొడిగించడం జరిగింది అని సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్. లక్ష్మణ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పంట సాగు చేసిన రైతు సోదరులు అందరూ పంట నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు.వాతావరణ బీమాకు సంబంధించి వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమోటా పంటలకు బీమా గడువు పూర్తి అయినది అని తెలిపారు.


