సిపిఐ జిల్లా కార్యదర్శి సి . జాఫర్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి
విశాలాంధ్ర- అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో సామాజికవేత్త నరేంద్ర సింగ్ బేడి మరణం పట్ల సిపిఐ జిల్లా కార్యదర్శి సి . జాఫర్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. కేశవరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి. కేశవరెడ్డి సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెనుగొండ కేంద్రంగా నరేంద్ర సింగ్ బేడీ యంగ్ ఇండియా ప్రాజెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో విశేష కృషి చేశారు. వికలాంగులకు, మహిళలకు చేతివృత్తుల్లో శిక్షణ ఇప్పించి పరికరాలను పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నరేంద్ర సింగ్ బేడి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం.