విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మిచెన్నకేశవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వామి సేవలో పాల్గొన్నారు. తెల్లవారుఝాము నుండే నిలబడిన ఉన్న భక్తులను క్యూలో పంపుతూ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు అవకాశం లేకుండా భక్తులకు స్వామి దర్శనం కలిగేలా సహకరించారు. వీరికి దేవాలయ అడ్హాక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీష్,, ఆలయ ఈవో వెంకటేశులు,కమిటీ సభ్యులు కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి,డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్ష వర్ధన్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
చెన్నకేశవుడి సేవలో వివేకానంద డిగ్రీ విద్యార్థులు
RELATED ARTICLES