నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ కు కృతజ్ఞతలు
ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య
విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బిసి గర్ల్స్ హాస్టల్ ప్రారంభించడం పట్ల ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్ ప్రారంభించడం వల్ల బత్తలపల్లి గ్రామపంచాయతీలో ఉన్న విద్యార్థులు ప్రతిరోజు గ్రామం నుంచి వచ్చి బత్తలపల్లి విద్యనభ్యసించి తిరిగి గ్రామాలకు వెళ్లాలంటే ఆటో చార్జీలు రవాణా చార్జీలు ఎక్కువై విద్యార్థులు చదువు మానేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేదని, కానీ నేడు ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమారు సార్ గారు యొక్క హాస్టల్ను ప్రారంభించి విద్యార్థుల యొక్క జీవితాలకు ముందడుగు వేసే విధంగా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. తదుపరి మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి అభివృద్ధి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పట్ల అలాగే కొనసాగించాలనిఏఐఎస్బి కోరారు.