Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రామానికి కేపిటి రోడ్డు మంజూరు చేయడం పట్ల హర్షం

గ్రామానికి కేపిటి రోడ్డు మంజూరు చేయడం పట్ల హర్షం

విశాలాంధ్ర ధర్మవరం ; మండల పరిధిలోని వసంతపురం గ్రామానికి కేబిటి రోడ్డు మంజూరు చేయడం పట్ల బీసీపీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వసంతపురంకు సరిగా రోడ్డు లేకపోవడం వలన గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురి అయ్యేవారని తెలిపారు. ప్రజా పరిష్కార వేదికలో గ్రామ ప్రజలు దరఖాస్తు చేసుకోవడంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టి, 2025-26 ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరుకు నివేదికలు పంపడం జరిగిందని తెలిపారు. ప్రజల కోసం బహుజన సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు