విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గ తాడిమర్రి మండలం చిత్రావతి రిజర్వాయర్ ముంపు గ్రామమైన మరిది మేకల పల్లిలో కేవలం దళితులకు మాత్రమే పారితోషకం ఇవ్వలేదని గత వైసిపి ప్రభుత్వంలో బాధితులు నష్టపోయారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 2022వ సంవత్సరంలో తిరుపతిలో నిర్వహించిన జనవానీ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తీసుకొని వెళ్లడం జరిగింది. దీంతో ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిమర్రి దళితులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున మొత్తం 119 మందికి పారితోషకం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం మధుసూదన్ రెడ్డికు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.
జనసేన పార్టీలో చేరిక;; జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా మధుసూదన్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 25వ వార్డ్ పార్థసారధి నగరకు చెందిన 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం వారు పార్టీలో చేరిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అంతేకాకుండా కార్యకర్తల కోసం నిరంతరం తాను అందుబాటులో ఉంటానని, ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ డిష్ రాజు, సంకు, అఖిల్, జీవన్, ఆది తదితరులు పాల్గొన్నారు.
దళితుల సమస్యను తీర్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
RELATED ARTICLES