రైతుల పొలాల్లో రహదారుల సమస్యలు పరిష్కరించాలి…
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ దాసు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముసుగు మధు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలు రెండు సెంట్లు కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది అని, మూడు సెంట్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు ఇచ్చిన అర్హులైన వారికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేయవలసిందిగా సిపిఐ ఆధ్వర్యంలో తాము డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పొలాల్లో రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, ఆ పొలాల్లో పంటలు వేసిన రోడ్డు పోవడానికి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుళ్లాయప్ప, తాడిమర్రి మండలం వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష ,కార్యదర్శులు లక్ష్మీనారాయణ ,దాసు, సన్న పెద్దన్న, వసురప్ప ,రాములు, నాగభూషణ, సూరి, లక్ష్మీనారాయణ, బత్తలపల్లి మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సన్న పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.