Thursday, April 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమృతి చెందిన మహిళ ఆచూకీ వివరాలు లభ్యం

మృతి చెందిన మహిళ ఆచూకీ వివరాలు లభ్యం

కేసును త్వరితగతిగా చేదిస్తాం.. రూరల్ శ్రీనివాసులు.
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామ పొలాల్లో ఓ గుర్తు తెలియని 57 సంవత్సరాల వయసు గల మహిళా శవం ఆచూకీ వివరాలను తెలుసుకోవడం జరిగిందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన మహిళ పేరు అక్కమ్మ (57) అని, ఈమె 27 సంవత్సరాల కిందట మేడాపురం గ్రామంలో భర్త ఓబులేసుతోపాటు ఉండేదని, తదుపరి భర్తను, కుటుంబాన్ని వదిలేసి ధర్మవరంలోని తిక్క స్వామి గుడి దగ్గర ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తూ ఉండేదని తెలిపారు. మృతురాలి సొంత ఊరు ధర్మవరం మండలంలోని రావులచెరువు గ్రామము అని తెలిపారు. మృతి చెందిన అక్కమ్మ వివరాలను తెలుసుకొని, ఆమె హత్య గావించబడిందా? లేదా అనుమానస్పద స్థితిలో మృతి చెందిందా? కుటుంబ కారణాలు, గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదా వ్యక్తిగత కారణాలతో మృతి చెందిందా? అన్న కోణంలో తాము దర్యాప్తును వేగవంతం చేయడం జరిగిందని తెలిపారు. మృతురాలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారని, వారి ద్వారా మరిన్ని వివరాలను విచారణ ద్వారా తెలుసుకుంటున్నామని తెలిపారు. రేగాటి పల్లి గ్రామ పొలాల్లో మృతురాలు ఎందుకు వచ్చింది? ఎందుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది? అన్న వివరాల కోసం దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు. వారం రోజుల క్రిందటే అక్కమ్మ మృతి చెందినట్లు తాము భావిస్తున్నట్లు వారు తెలిపారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా పలు కోణాలలో తాము దర్యాప్తును చేపట్టడం జరిగిందని తెలిపారు. అతి త్వరలోనే అక్కమ్మ కేసును చేదించి, వివరాలను తెలుపుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు