విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయమునకు పలువురు భక్తాదులు విరాళమును కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ఓ భక్తుడు అన్నదానమునకు పదివేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా టీ ప్రభాకర్ అను భక్తుడు నూతనంగా నిర్మాణమవుతున్న శివాలయమునకు పదివేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా భక్తాదుల పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఆలయం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని వారు తెలిపారు. అతి త్వరలో శివాలయం నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
బాబా ఆలయమునకు విరాళం అందజేసిన భక్తాదులు
RELATED ARTICLES