డిప్యూటీడిఎం అండ్ హెచ్. డాక్టర్ చెన్నారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ఇన్చార్జ్ డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్ అధ్యక్షతన చిన్న పిల్లలలో వచ్చు అభివృద్ధి ఆటంకాలు గురించి, చిన్నపిల్లలపై లైంగిక దాడులు గూర్చి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్, సైకియాట్రీ డిపార్ట్మెంట్ డాక్టర్ విష్ణు, డాక్టర్ ప్రేమ్ కుమార్ పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ సోమశేఖర్, మలేరియా అసిస్టెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో డాక్టర్ సునీల్ మాట్లాడుతూ చిన్నపిల్లల లో వచ్చు అభివృద్ధి నిరోధకాల గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో డిస్టిక్ టి ఓ టి అయిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గర్భవతిగా ఉన్నప్పుడు నుండి కాన్పు వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సేవలు అందుతాయో , పుట్టినప్పుడు నుంచి ఐదు సంవత్సరాలు వరకు చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల గురించి వాటి నివారణ గురించి తెలియజేశారు. గర్భవతిగా నమోదు చేయనప్పుడు ఇచ్చే ఎన్సీపీ కార్డు గురించి వివరంగా తెలియజేశారు. సైకియాట్రీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాట్లాడుతూ సమాజంలో చిన్నపిల్లల పైన జరిగే లైంగిక దాడుల గురించి సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమమునకు ధర్మవరం రెవెన్యూ డివిజన్ లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దర్శనమల, తాడిమర్రి, ముదిగుబ్బ ,బత్తలపల్లి, కనగానపల్లి , ఎన్ ఎస్ గేట్, రామగిరి ,పేరూరు నుండి వచ్చిన ఎం ఎల్ హెచ్ పి ఎస్ పాల్గొన్నారు.
పిల్లలకు వచ్చే అభివృద్ధి ఆటంకాలపై అవగాహన..
- Advertisement -
RELATED ARTICLES


