విశాలాంధ్ర ధర్మవరం: జాతీయ స్థాయిలో ఈ నెల ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు చిత్తూర్ నగరంలో నగరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ యూత్ బాస్కెట్బాల్ రాష్ట్ర జట్టు క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన ఎం.కార్తీక్ నాయక్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ తేదీ నుండి 11 వరకు కాకినాడ జిల్లా పిఠాపురం లో జరిగిన లో ఉమ్మడి బాలుర బాస్కెట్బాల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని ప్రతిభ ఎంపికయ్యారు అని తెలిపారు.వీరి ఎంపిక పట్ల , ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి ,ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, గవర్నమెంట్ హై స్కూల్ పిడి. నాగేద్ర హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాణిoచి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు.
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుక్యాంపుకు ధర్మవరం బాలుడు ఎంపిక
RELATED ARTICLES