విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని బృందావన్ కాలనీలో రూరల్ ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామములోని ఇంటింటా వారు తనిఖీలు నిర్వహించారు. అనంతరం కొత్త వ్యక్తులు, గ్రామాల్లో ఏదైనా మార్పులు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎస్సై గ్రామసభలు నిర్వహించి వారి విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో కొత్త వ్యక్తులు వస్తే మాకు సమాచారం అందించాలని, కక్షపూరిత విషయాలకు దూరంగా ఉండాలని, ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని, చట్టపరిధిలో జీవించాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు వహించాలని, బాల్య వివాహాలను నిర్వహించరాదని, రోడ్డు భద్రత విషయంలో కొన్ని విషయాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. అన్ని గ్రామాలలో డ్రోన్ కెమెరా ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నమని, ఏదైనా ఆపద, సమస్యలు ఎదురైతే నేరుగా పోలీస్ స్టేషన్కు గాని లేదా డైల్ 100 ఫోను చేయవచ్చు అని తెలిపారు. చట్ట పరిధిలోని గ్రామ ప్రజలు నిర్వహించాలని, రాజకీయాలకు దూరంగా ఉంటూ, కుటుంబ పోషణ, కుటుంబ సంబంధాలకు అతీతంగా ఉండాలని తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు నిర్వహిస్తే కేసులు కడతామని, రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
బృందావన్ కాలనీలో కార్డెన్ సెర్చ్
RELATED ARTICLES