విశాలాంధ్ర -ధర్మవరం ; గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్ కు చెందిన జానపద కళాకారుని సోమిశెట్టి సరళ చోటుచోటు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి సరళ మాట్లాడుతూ తాను ఏడు సంవత్సరాల వయసులోనే జానపద గేయాలు పాడటంలో ఎంతో శ్రద్ధతో నేర్చుకోవడం జరిగిందని, గురువు లేకనే స్వశక్తితో జానపద గేయాలు నేర్వడం జరిగిందన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు చేసుకున్నట్లు ధృవీకరించిన సర్టిఫికెట్ను వారు చూపించారు. 2025 జనవరి 26న ఢిల్లీలో జరిగిన పేరేడ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున టీం లీడర్ గాయత్రీ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో తన బృందంతో గరగ నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. మా తండ్రి రామయ్య పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారని తెలిపారు. అదేవిధంగా అమ్మ శారదమ్మ గృహిణిగా ఉంటూ మాకు మంచి నడవడికలు కూడా నేర్పిందని తెలిపారు. నాకు తెలిసిన జానపద సంగీతంలో ఇతర కళాకారులకు మెలుకువలు సూచనలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా జానపద కళాకారునిగా, పరిశోధన రచయితగా కూడా తాను పనిచేస్తున్నానని తెలిపారు. స్వతంత్ర సమరయోధుల217 కథనాలు ఆజాద్ ఇక అమృత్ మహోత్సవ వెబ్సైట్లో సమర్పించడం జరిగిందని తెలిపారు. ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ కళాకారునిగా ఉమ్మడి రాష్ట్రాలలో గుర్తింపు పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా లలిత సంగీతం గ్రామ లో బి హై గ్రేడ్ లో కళాకారునిగా గుర్తింపు పొందడం జరిగిందన్నారు. నా జీవితాన్ని కళా సేవకు అంకితం చేయడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. జానపద సంగీతం సాహిత్యం జాతీయ స్థాయిలో జూనియర్ ఫెలోషిప్ అవార్డును 2011-12 లో ప్రథమ స్థానంలోనూ, సీనియర్ ఫెలోషిప్ జాతీయ స్థాయిలో అవార్డును 2019- 20 లో ప్రథమ స్థానం పొందడం జరిగిందన్నారు. జానపద కళారూపాలు గూర్చి నేటికీ తాను పరిశోధన చేస్తున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా 240 కళాకారులను గూర్చి కేంద్ర సాంస్కృతిక శాఖకు కూడా 2024లో పంపడం జరిగిందన్నారు. తదుపరి డిడిఆర్ ప్రాజెక్ట్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఢిల్లీలో బ్రాండ్ అంబాసిడర్ గా తాను మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. భారతదేశంలోనే జానపదం ఎంతో కీలకపాత్ర వహిస్తుందని, అటువంటి జానపదముకు ఒక కళాకారునిగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరము అని వారు స్పష్టం చేశారు. మున్ముందు కూడా ఒక జానపద కళాకారునిగా దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు నా సేవలు అందిస్తానని వారు తెలిపారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న ధర్మవరం జానపద కళాకారిణి సోమిశెట్టి సరళ
RELATED ARTICLES