Saturday, January 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ స్థాయిలో జరిగే బాస్కెట్ బాల్ పోటీల్లో ధర్మవరం బాలిక ఎంపిక

జాతీయ స్థాయిలో జరిగే బాస్కెట్ బాల్ పోటీల్లో ధర్మవరం బాలిక ఎంపిక

శెట్టిపీ జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం ; జాతీయస్థాయిలో స్థాయిలో ఈ నెల జనవరి 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో జరిగే అండర్ 17 బాలికల ఎస్ జి ఎఫ్ నేషనల్ గేమ్స్ నందు పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు నందు ధర్మవరం పట్టణానికి చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారిణి జి.కిరణ్మయి ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం అక్టోబర్ 26వ తేదీ నుండి29 తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా మార్టూరు లో జరిగిన టోర్నమెంట్లో అత్యంత ప్రతిభ చూపించి ,కిరణ్మయి ఎంపిక పట్ల ధర్మాంబా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు .జాతీయస్థాయిలో రాష్ట్ర జట్టులో స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు… ఎంపికైన క్రీడాకారిణి శనివారం రోజున బయలుదేరి చెన్నై నగరమునకు వెళ్లారు అని తెలిపారు. పట్టణ క్రీడాకారులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు