విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రస్థాయిలో జరిగిన ఇంటర్ స్కూల్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ధర్మవరం బాలికల జట్టు రాణించి టోర్నమెంట్ రన్నర్స్ గా (ద్వితీయ స్థానం) సాధించిందని అనంతపురం ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపీ జయచంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 డిసెంబర్ 28, 29, 30 తేదీలలో చిత్తూరు నగరంలోని పి ఈ ఎస్ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన టోర్నమెంట్లో ధర్మవరం జట్టు చిత్తూరు జిల్లాకు చెందిన బంగారుపాలెం జట్టు తలపడగా హోరాహోరీగా జరిగాయి అని తెలిపారు. ఫైనల్స్ లో బంగారుపాలెం జట్టు 36 పాయింట్లు, ధర్మవరం జట్టు 34 పాయింట్లు సాధించగా, కేవలం రెండు పాయింట్లు తేడాతో ధర్మవరం జట్టు ఓటమి చెంది, రన్నర్స్ గా నిలిచింది అని తెలిపారు.ఈ టోర్నమెంట్లో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి అని తెలిపారు.రాష్ట్రస్థాయిలోనే ధర్మవరం బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల జయచంద్ర రెడ్డి , ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, సెక్రటరీ వాయల్పాడు ఇదయతుల్లా, కోచ్ సంజయ్, సీనియర్ క్రీడాకారులు, స్థానిక బాస్కెట్బాల్ గ్రౌండ్లో బాలికలకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన ధర్మవరం బాలికల జట్టు
RELATED ARTICLES