Friday, December 27, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసకాలంలో యువతిని రక్షించిన ధర్మవరం ఆర్పిఎఫ్ పోలీసులు

సకాలంలో యువతిని రక్షించిన ధర్మవరం ఆర్పిఎఫ్ పోలీసులు

విశాలాంధ్ర ధర్మవరం; తిరుపతి-గుంతకల్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి కనపడటం లేదని ఒక తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్ రావడంతో, ధర్మవరం ఆర్పీఎఫ్ పోలీసులు సకాలంలో స్పందించి యువతిని రక్షించి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్పిఎఫ్సి బోయ కుమార్ మాట్లాడుతూ తప్పిపోయిన యువతి హరిత, తమ్ముడు కలికిరి నుంచి గుంతకల్లుకు వెళ్తున్నారని, ముదిగుబ్బ రైల్వే స్టేషన్ అనంతరం రెస్ట్ రూమ్ కు వెళ్లిన ఆమె తిరిగి కోచ్ వద్దకు రాలేదని ఫోన్ ద్వారా తెలపడం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు తప్పిపోయిన హరిత మొబైల్ నెంబర్ను, ధర్మవరం జి ఆర్ పి ఇన్స్పెక్టర్ వారి సహాయముతో ప్రత్యక్ష స్థానాన్ని ట్రాక్ చేయడం జరిగిందని తెలిపారు. దీంతో ఆ యువతి ముదిగుబ్బ-చినగుంటపల్లి స్టేషన్ల మధ్య డి చెర్లోపల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఉనికిని లోకేషన్ గుర్తించిందని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న సెక్షన్ లోని ఆన్ డ్యూటీ కి మెన్ మస్తాన్ను అప్రమత్తం చేసి తక్షణ చర్యలను చేపట్టడం జరిగిందని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఆ అమ్మాయి అనేక గాయాలతో ట్రాక్ పక్కన పడి ఉండటం గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా బత్తలపల్లి మండలంలోని ఆర్డిటి ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. గాయపడిన బాలిక పేరు బోయ హరిత అని గుర్తించడం జరిగిందన్నారు. ఈ అమ్మాయి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన నాగరాజు అనే తండ్రి యొక్క కుమార్తె అని తెలిపారు. కలికిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోందని, హరిత సోదరుడు గిరిబాబుతో సెలవులకు ఇంటికి వెళ్లేందుకు రైల్లో పోవడం జరిగిందని, ముదిగుబ్బ రైల్వే స్టేషన్ తర్వాత వాష్ రూమ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కదులుతున్న రైలు నుంచి హరిత జారిపడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ప్రస్తుతం హరిత ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఆర్డిటి ఆసుపత్రి వైద్యులు తెలపడం జరిగిందని తెలిపారు. ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ తో పాటు జిఆర్పి ద్వారా సమయానికి ఆ అమ్మాయిని రక్షించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేగవంతమైన ప్రతిస్పందన ప్రయాణికుల భద్రత సంక్షేమానికి ఆర్పిఎఫ్ యొక్క నిబద్దతను హైలెట్ చేయడం మాకెంతో గర్వకారణమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు