విశాలాంధ్ర ధర్మవరం;; తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కేశవ నగర్ కు చెందిన అచ్యుత శ్రీనివాసులు, ఉమామహేశ్వరి రెండవ కుమారుడు అచ్యుత భాను ప్రకాష్ ఎంఈసి గ్రూపు ప్రథమ సంవత్సరం లో 500 మార్కులకు గాను 495 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానమును కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అబ్బాయి పదవ తరగతి ధర్మవరం మండలం నాగులూరు లోని బీసీ ఎంఆర్ఓ చదవడం జరిగిందని, చదువు మీద ఎంతో ఆసక్తిని కనపరిచే వాడని తెలిపారు. మా అబ్బాయి ఇంతటి ప్రతిభను కనపరచడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, శ్రీ సత్య సాయి జిల్లాకు, ధర్మవరం పట్టణానికి మంచి గుర్తింపురావడం మాకెంతో ఆనందదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా తన స్వగృహంలో కుమారునికి తల్లిదండ్రులు స్వీట్ లను తినిపించి తమ ఆశీస్సులను అందజేశారు. తదుపరి బంధుమిత్రులు, కేశవ నగర్ ప్రజలు, తోటి విద్యార్థులు కలిసి అచ్యుత భాను ప్రకాష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన ధర్మవరం విద్యార్థి ..
RELATED ARTICLES