Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅబాకస్ లో ప్రతిభ చూపిన ధర్మవరం విద్యార్థులు

అబాకస్ లో ప్రతిభ చూపిన ధర్మవరం విద్యార్థులు

విశాలాంధ్ర -ధర్మవరం:: చెన్నై లో ఈనెల 2వ తేదీన ఈ సి ఎం ఏ ఎస్ అబాకస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ డైరెక్ట్ అబాకస్ కాంపిటీషన్-2025 లో మిరాకిల్ ఎడ్యుకేషన్ సెంటర్ ధర్మవరానికి చెందిన విద్యార్థులు సత్తా చాటడం జరిగిందని డైరెక్టర్ శ్రీ వాణి, ప్రాంచేజ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాల వయసు గల జయానందన్, 8 సంవత్సరాల వయసు గల మోక్షజ్ఞ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ ను సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా పన్వీత్, శౌర్య, నాగచరిత్, దివేష్, నిత్యశ్రీ, గ్రీష్మ, ఆదిత్య సాయి ఛాంపియన్ ట్రోఫీ సాధించగా, ధన్విన్ కృష్ణ, దానిష్ రాజ్, జయదీప్, కీర్తి ప్రియ, పద్మజ్, హేత్విక, ఆరాధ్య, చైత్ర, హవీష శ్రీ విన్నర్ టోపీలుగా, లోహిత్, సజీవ్, మోనిత్, బ్రితిక, లోకేష్ లు టాపర్స్ గా నిలవడం జరిగిందన్నారు. ఈ కాంపిటీషన్లో పదివేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. మిరాకిల్ ఎడ్యుకేషన్ సంస్థ ధర్మవరంలో 2007 లో ప్రారంభించబడి, ఇప్పటివరకు వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి కాంపిటీషన్లో పాల్గొని 15 సార్లు బెస్ట్ ఇన్స్ట్రక్చర్ అవార్డు పొందడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ పోటీలో అవుట్ స్టాండింగ్ ప్రొఫార్మెన్స్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలిపారు. అబాకస్ లో విద్యార్థులను మరింత అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్తామని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చీకన విద్యార్థులకు వన్టౌన్ ఎస్ఐ. గోపి కుమార్, సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కోశాధికారి సోలిగాళ్ళ వెంకటేశ్వర్లు, చేతుల మీదుగా ప్రతిభ చూపిన వారికి ట్రోపీలు సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు