సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు
విశాలాంధ్ర -ధర్మవరం : ప్లంబర్ కార్మికులతో ఈనెల 24వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎన్జీవో హోం లో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 650-2 సర్వే నంబర్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని, దాదాపు వారం రోజులవుతున్న ఇంతవరకు ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదని, ఇది ఇలాగే కొనసాగితే 24వ తేదీన సోమవారం నాడు ప్లంబర్ కార్మికులను కలుపుకొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులకు హెచ్చరించారు.. ప్లంబర్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం పోరాటం సలుపుతా మనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్,పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ,చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా,ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడుగోవిందరాజు,కార్యదర్శిలక్ష్మీనారాయణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజ్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.
ప్లంబర్ కార్మికులతో ఈ నెల 24వ తేదీన ధర్నా..
RELATED ARTICLES