విశాలాంధ్ర :చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : చిలమత్తూరు పంచాయతీ పరిధిలోని తుమ్మలకుంట గ్రామంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో శుక్రవారం నిరుపేదల ఆరోగ్యం కొరకై సొంత ఖర్చులతో నియోజకవర్గపు ప్రజలకు ఆరోగ్యములను మెరుగుపరుచుటకు నియమించిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా వ్యాధులు దూరం అవుతున్నాయని ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు తుమ్మలకుంట గ్రామంలోని నిరుపేదలకు వైద్య సేవలు నిర్వహించిన సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బాలకృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ నందిషప్ప, డీలర్ K. ఆదిమూర్తి, మైనార్టీ నాయకులు రహంతుల్లా, రఫిక్, గౌసు, ఆటో రామంజి. డీలర్ ముద్ధన్న , గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య సేవల తో వ్యాధుల దూరం
RELATED ARTICLES