చీఫ్ సూపర్డెంట్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ వి యూనివర్సిటీ దూర విద్యా పరీక్షలు ఈనెల రెండవ తేదీ నుంచి సజావుగా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపర్ అటెండెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దూర విద్యా పరీక్షలు పీజీ మొదట సంవత్సరం రెండవ సంవత్సరం వారికి ఉదయము, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దూరవిద్య డిగ్రీ ఫైనల్ సంవత్సరపు విద్యార్థులకు పరీక్షలు ఉదయము, అదేవిధంగా మధ్యాహ్నం మొదటి సంవత్సరపు విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మా కళాశాలకు 130 మందిని అలాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు 60 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. మొత్తం నాలుగు గదులలో ఆరు మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా రామాంజనేయులు పరీక్షా గదులను నిత్యం పరిశీలిస్తున్నారని, కాఫీకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. ఈ పీజీ అండ్ డిగ్రీ పరీక్షలు ఈనెల 23వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్ష నిర్వాహకులు పాల్గొన్నారు.
సజావుగా జరుగుతున్న దూర విద్యా పరీక్షలు..
RELATED ARTICLES