విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని కోటపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు గురవారం యుటిఎఫ్ నాయకులు, సత్యన్న సేన కొక్కంటి క్రాస్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే రూపొందించబడిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రచురించి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాదన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. 10వ తరగతి మోడల్ పేపర్లు ఉచితంగా అందజేసిన సత్యన్న సేన కొక్కంటి క్రాస్ టీం కు విద్యార్థులు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ నాయకులు బాలకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు