Wednesday, February 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం::ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ, నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం ధర్మవరంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ,ాప్రజల సంక్షేమం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ముద్రమైన అంశం. ప్రభుత్వానికి, ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్య సేవలు అందించడంలో కేటాయించిన నిధులు సానుకూలంగా వినియోగిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా ఉంది్ణ అని తెలిపారు. అలాగే, వైద్య సహాయం, ఆరోగ్య సేవలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో పాజిటివ్ మార్పులు తీసుకువచ్చాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు తీసుకుంటామని అని చెప్పారు. చెక్కులను అందుకున్న ప్రజలు మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను అందరికీ చేరవేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు