Tuesday, April 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ధర్మవరం : ప్రైవేట్ ఆస్పత్రులలో పలు వ్యాధులతో చికిత్స పొందిన ధర్మవరం మండల పరిధిలోని నాగలూరి గ్రామానికి చెందిన అనంతమ్మ కి 87,938 రూపాయిలు విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజక వర్గ క్లస్టర్ ఇన్చార్జి మహేష్ చౌదరి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది అభాగ్యులు సకాలంలో చికిత్స పొందలేక ప్రైవేట్ ఆస్పత్రిలలో అప్పులు చేసి , ఖర్చు పెట్టుకున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉందని ఆయన అన్నారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ కిధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి విజయ్ సారది, జంగం నర్షింహులు నా లింగపప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు