స్పందన హాస్పిటల్ డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కంటి విభాగానికి అవసరమైన సామాగ్రిని స్పందన ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సుమారు 40 వేల రూపాయలు విలువచేసి విజన్ చార్టర్, ట్రయల్ ఆప్టికల్ బాక్స్, డైరెక్ట్ ఆప్తాల్మిక్ స్కోప్, కలర్ విజన్ చార్ట్, నియర్ విజన్ చార్ట్ తదితర కంటి సామాగ్రిని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ మాధవి కు అందజేశారు. ఈ సందర్భంగా బషీర్, సోనియా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వందలాదిమంది రోగులు వస్తుంటారని, అందులో భాగంగా కంటికి సంబంధించినటువంటి ఈ సామాగ్రి డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక సేవలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తాము చేపట్టడం జరిగిందని తెలిపారు. తదుపరి సూపర్డెంట్ డాక్టర్ మాధవి, ఆసుపత్రి వైద్యులు స్పందన హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉదయభాస్కర్, ప్రభుత్వ వైద్యులు నజీర్, రాముడు,హరి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి కంటి విభాగ సామాగ్రి విరాళ పంపిణీ..
RELATED ARTICLES