Saturday, May 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహాకీ క్రీడాకారులకు హాకీ స్టిక్కుల పంపిణీ..

హాకీ క్రీడాకారులకు హాకీ స్టిక్కుల పంపిణీ..

హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం;; హాకీ శ్రీ సత్య సాయి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవికాలం శిక్షణ సందర్భంగా 45 మంది హాకీ క్రీడాకారులకు స్టిక్కులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, సత్యసాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ పంపిణీ అనంతరం వారు మాట్లాడుతూ వేసవి శిక్షణ సందర్భంగా క్రీడాకారులందరు హాజరై శిక్షణ మెలుకువలు నేర్చుకొని హాకీ ని అభివృద్ధి పథంలోనికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హాకీ శ్రీ సత్యసాయి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గౌరీ ప్రసాద్, ట్రెజరర్ అంజన్న, సత్యసాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాకీ కోచ్ హస్సేన్, హాకీ శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ సెక్రెటరీ అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్ మారుతి , సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు