శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పాడేరు నుంచి పుట్టపర్తికి వస్తున్న 210 మంది సేవాదళ్ మందికి ధర్మవరం రైల్వే స్టేషన్లో శ్రీ సత్య సాయి సేవా సమితి గాంధీనగర్ కన్వీనర్ నామ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజనపు ప్యాకెట్లతోపాటు వాటర్ ప్యాకెట్లను కూడా వారు పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాదాతగా శేషాచారి నిర్వహణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తి బాబా ఆశీస్సులతో పుట్టపర్తికి వెళ్లే భక్తాదులకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. అనంతరం స్టేషన్ మాస్టర్ నరసింహా నాయుడు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు అనన్యమైనవని, అందరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని మానవతా విలువలను పెంచాలని తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడంలో లేదా సేవా కార్యక్రమాన్ని అందించడంలో ఉన్న తృప్తి మరెక్కడ లభించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదిమంది సమితి సభ్యులు పాల్గొన్నారు.
రైలు ప్రయాణికులకు భోజనపు ప్యాకెట్లు పంపిణీ…
RELATED ARTICLES