Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి1000 మందికి భోజనం పంపిణీ..

1000 మందికి భోజనం పంపిణీ..

వి ఎస్ వి ఫౌండేషన్ సంస్థ
విశాలాంద్ర ధర్మవరం:: మహాశివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని శివానగర్లో గల శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి రథోత్సవం సందర్భంగా వి ఎస్ వి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో భోజనం పంపిణీను నిర్వహించినట్లు ప్రతినిధులు బుడగ వెంకట నారాయణ, వేణుగోపాల్, పాలగిరి శ్రీధర్, పూలశెట్టి రవికుమార్ తెలిపారు. ఈ భోజనం ప్యాకెట్లను వన్ టౌన్ ఎస్ఐ కేతన్న తోపాటు మధు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కొత్త ప్రసాద్, నవీన్ ,రమేష్, శ్రీనివాసులు, వెంకటస్వామి, రాజా, విజయభాస్కర్, రవి, ఓం శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు